
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తెచ్చిన సంక్షోభంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన11 మంది రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు ఉంటే.. ‘మా’అభివృద్ది ఆటంకం ఏర్పడుతుందని, సమస్యలు ఎత్తి చూపితే తమ వళ్లే జరగలేదని చెప్పే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ‘మా’అధ్యక్షుడిగా చేసిన నరేశ్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు పనిచేస్తాడని శ్రీకాంత్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని విష్ణు నెరవేర్చాలని, లేదంటే కచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పారు. ‘మా’సంక్షేమం కోసమే తాము రాజీనామా చేశామని, తమకు ఓట్లేసిన వారు ఈ ఒక్కసారి క్షమించాలని శ్రీకాంత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment