Babu Mohan Respond On Pawan Kalyan Comments: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఇక త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలు జరగనున్న నేపథ‍్యంలో పవన్ ఆన్‌లైన్ టికెట్ల విధానంపై స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు బాబూ మోహన్, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
చదవండి: posani krishna murali: పోసాని ఇంటిపై రాళ్లదాడి
‘మా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్లో బాబూ మోహన్ సభ్యుడిగా ఉన్న సంగతి విదితమే. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో బాబూ మోహన్ మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు. ఇంతకీ ఆయన పరిశ్రమ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? ముందుగా పవన్ కల్యాణ్ తేల్చుకోవాలి. సర్కారు సహకారం ఇండస్ట్రీకి అవసరం. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీనే ఓ విషయం అడిగింది. దీనిపై పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడారు’ అన్నారు.
చదవండి: ‘మా’ ఎన్నికలు: వైరల్ అవుతున్న ప్రకాశ్ రాజ్ ట్వీట్
అలాగే ‘ఈ విషయంలో పవన్ వ్యవహరించిన తీరు సరైనది కాదు. నిన్న పవన్‌కు మా విష్ణు బాబు ఓ ప్రశ్న వేశారు. అందులోనే ఓ విషయం ఉంది. పవన్‌ను ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా అని విష్ణు ప్రశ్నించారు. ఏదేమైనా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి. అంతేగాని తెరముందుకు వచ్చి మాట్లాడటం ఏంటి? మరి అంత చిరాకుతో మాట్లాడటం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల మన పరిశ్రమ పరువే పోతుంది. అంత పెద్ద అన్యాయమే జరిగితే పెద్ద మనుషులతో మాట్లాడి తేల్చుకోవాలి’ అంటూ బాబూమోహన్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment