![Movie Artist Association tie-up with Bollywood Artist Association - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/23/manchu-vishnu.gif.webp?itok=m0OowRds)
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు.
మంచు విష్ణు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కలిసి, రెండు అసోసియేషన్‌లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతి΄ాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ‘‘త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి’’ అన్నారు మంచు విష్ణు.
Comments
Please login to add a commentAdd a comment