
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
(ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..)
మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
(ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!)