MAA president
-
‘మా’తో బాలీవుడ్ ఒప్పందం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కలిసి, రెండు అసోసియేషన్లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతి΄ాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ‘‘త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి’’ అన్నారు మంచు విష్ణు. -
ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) -
దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు
సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజా. ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం చేయగా.. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో ఆమె పాత్రకు బాగా గుర్తింపు వచ్చింది. బ్రహ్మనందంతో కలిసి ఆమె చేసిన కామెడీకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్‌గా రాణించిన ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెంటనే పాకీజాకి లక్షరూపాయలు అందించి మరోసారి మంచి మనసును చాటుకున్నారు. ఆ తర్వాత ఆమె విషయం తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా పాకీజా తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును ఆమెకు అందించనున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ.లక్ష రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 90 వేలకు తగ్గించారు. మా అసోసియేషన్‌కు కట్టాల్సిన రూ.90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి పాకీజాకు కార్డు ఇస్తారంటూ కల్యాణి వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబానికి మా అసోసియేషన్ ద్వారా లభించే అన్నింటికీ అర్హత దక్కుతుందని తెలిపింది. -
‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మంచు విష్ణు (ఫొటోలు)
-
మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు
Manchu Vishnu Interesting Comments On Maa Building: ‘‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సభ్యుల ఆరోగ్యం, అవకాశాలు, సంక్షేమం కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల హామీలో భాగంగా ‘మా’కి శాశ్వత భవన నిర్మాణం కోసం ఆరు నెలల్లో భూమి పూజ చేస్తాం’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో ‘మా’ సభ్యులకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మా’ ఎన్నికల హామీలను 6 నెలల్లోనే 75 శాతం పూర్తి చేశాను. ‘మా’ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం. ‘మా’ సభ్యత్వం నిబంధనలను కఠినతరం చేశాం.. అందుకు డీఆర్సీ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, సభ్యులు బాలకృష్ణ, మోహన్ బాబు, గిరిబాబు, జయప్రద, శివకృష్ణ అమోదం తెలిపారు. కళామతల్లిని నమ్ముకున్న వారే ‘మా’లో సభ్యులుగా చేరాలి. సినిమా టెక్కెట్ ధరల పెంపు విషయంలో నేను మాట్లాడలేదని నన్ను విమర్శించినా, సైలెంట్‌గా ఉన్నా. ఒక రాష్ట్రంలో టిక్కెట్ ధరలు పెంచినందుకు, మరో రాష్ట్రంలో టిక్కెట్ ధరలు తగ్గించినందుకు కోర్టులకు వెళ్లారు. అలాగే కొన్ని సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచారు. దాని వల్ల విపరీతమైన ఇబ్బంది ఉందని అంటున్నారు. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే చర్చ చాలా పెద్దది. దాని గురించి నేను చెప్పేకన్నా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ కలిసి చర్చించి, ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షులు మాదాల రవి, పృధ్వీ, నటుడు వీకే నరేష్, ట్రెజరర్ శివబాలాజీ, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సినిమా టికెట్ల ధరలపై ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంచు విష్ణు
-
‘మా’ అధ్యక్ష బరిలో జీవిత
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగనున్న ‘మా’ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రేసులో జీవితా రాజశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జీవిత. అధ్యక్ష పదవిలో ఉంటే ఇంకా ఎక్కువగా సేవలు చేసే వీలుంటుందనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగారని సమాచారం. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, యంగ్ హీరో విష్ణు పోటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జీవిత పేరు కూడా చేరడంతో ‘మా’ ఎన్నికల గురించి వాడి వేడి చర్చలు మొదలయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడాలనుకుంటున్న విషయాన్ని మరో రెండు రోజుల్లో జీవిత అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. -
పంచభూతాల ఆధారంగా...
సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద్ థాట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏకమ్’ . ది జర్నీ ఆఫ్ ఏ జాబ్‌లెస్ గాడ్ అనేది ఉపశీర్షిక. వరుణ్ వంశీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. కళ్యాణ్ శాస్త్రి, పూజ, శ్రీరామ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివుని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం టీజర్‌ను ‘మా’ అధ్యక్షుడు నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. ఈ ’ఏకమ్’ చిత్రం కూడా కొత్తగా కనబడుతోంది’ అన్నారు. ‘‘న్యూ జోనర్, క్లాసికల్ చిత్రంగా తెరకెక్కుతోంది. వరుణ్‌గారు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు హీరో అభిరామ్ వర్మ. వరుణ్ వంశీ మాట్లాడుతూ– ‘‘కళ్యాణ్ శాస్త్రిగారు నాకు పదకొండేళ్లుగా తెలుసు. ఆయన నా గురువు కూడా. ‘ఏకమ్’ సినిమా విషయానికి వస్తే పంచభూతాల ఆధారంగా సినిమా స్టోరీ ఉంటుంది’’ అన్నారు. కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ – ‘‘మా అమ్మాయి పేరునే నా బ్యానర్‌కు పెట్టడం జరిగింది. అందుకు కారణం మాత్రం వరుణ్. అతను నా శిష్యుడు. చిన్నప్పటి నుంచి కథలు బాగా చెప్పేవాడు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా చూపించాలనే తపన, టాలెంట్ వరుణ్‌కు ఉన్నాయి. అదే నమ్మకం నన్ను ప్రొడక్షన్ వైపు నడిపించింది’’ అన్నారు. సంస్థ బేనర్‌ను రాజ్ కందుకూరి, అనిల్ సుంకర విడుదల చేశారు. -
అది కరెక్ట్ కాదు
2019–2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీనియర్ నరేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈ నెల 22న ముహూర్తం నిర్ణయించుకున్నారు నరేశ్. అయితే అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేయడానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నరేశ్. 2017–2019 కాలపరిమితికి శివాజీ రాజా ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్ ప్రమాణ స్వీకారం చేయాలంటే తన పదవీ కాలం ముగియాలని శివాజీరాజా అంటున్నారని నరేశ్ చెబుతున్నారు. ఇంకా నరేశ్ మాట్లాడుతూ– ‘‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని పని చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలో ఈ 22న మంచి మూహుర్తం ఖరారు చేసుకుని ప్రమాణా స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ‘నా పదవీకాలం 31వరకు ఉంది. అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చోవద్దు. కోర్టుకి వెళతా అని శివాజీ రాజా ఫోన్లో బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెబితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు. -
తెలుగు వారికి ప్రాధాన్యం ఇవ్వండి
‘‘తెలుగు సినిమాలో తమిళ నటీనటులు ఉండొచ్చా? లేదా? అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఉంటే అనువాద చిత్రం అనే భావన వస్తుంది. మన తెలుగు వాళ్లను మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. హీరోయిన్స్ ఎలాగూ తప్పదు.. చిన్న చిన్న నటీనటులను కూడానా? మన వారికి ప్రాధాన్యం ఇవ్వండి. వాళ్లు కుదరకపోతేనే ఇతర భాషల వారిని తీసుకురండి’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో అమర్, ప్రదీప్వర్మ, ఉదయ్, అభి, సి.టి., ఖాదర్, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వం వహించారు. రాజ్ ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ పతాకంపై విక్కీరాజ్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేష్ చౌదరి మాట్లాడుతూ– ‘‘30ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో– డైరెక్టర్‌గా పని చేస్తున్న నేను ‘చెడ్డీ గ్యాంగ్’ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళతారు. అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు. ‘‘మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన ఐటమ్ సాంగ్ యువతను ఆకట్టుకుంటుంది’’ అని విక్కీరాజ్ అన్నారు. సెన్సార్ సభ్యులు ఎంఎస్ రెడ్డి, పాటల రచయిత లక్ష్మణ్, పద్మాలయ మల్లయ్య పాల్గొన్నారు. -
వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా
హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, వర్మ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివాజీరాజాను 'సాక్షి' ఫోన్లో సంప్రదించగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొచ్చి వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ కేసుకు ఒరిగేదేం లేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు, విచారణ చేపట్టిన అధికారులకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు. సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజనిజాలు వెల్లడవుతాయి. ఈ కేసుపై ఇండస్ట్రీ వారితో పాటు బయటివారు ఏం మాట్లాడినా అబద్దాలు నిజాలు కావు. నిర్దోషులుగా ఉన్న వ్యక్తులను దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని' చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన మరికొందరికి నోటీసులు అందే అవకాశం ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ విషయం విచారణ కొనసాగిస్తున్న అకున్ సబర్వాల్ మాత్రమే చెప్పగలరని ఆయన బదులిచ్చారు. టాలీవుడ్ సెలబ్రిటీలను విచారిస్తున్నట్లుగానే డ్రగ్స్ కేసులో స్కూలు, కాలేజీ విద్యార్థులను విచారిస్తారా అని వర్మ ప్రశ్నించడంపై మా అధ్యక్షుడు శివాజీరాజా పై విధంగా స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలిలా చూపిస్తుందని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 తీస్తారేమోనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే విమర్శించడానికి వాళ్లు వేసే నిందలను బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ ప్రముఖ రచయిత సిరాశ్రీ ఇటీవల పోస్ట్ చేసిన కవితను దర్శకుడు వర్మ మళ్లీ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. 15 మందికి పైగా సినీ సెలబ్రిటీలకు నోటీసులు అందాయన్న వార్తతో ఇండస్ట్రీ ఎలర్ట్ అయ్యింది. అయితే నోటీసులు వచ్చిన వారితో పాటు కొంత మంది నోటీసులు రానివారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మా అధ్యక్షుడు శివాజీ రాజా, ఇండస్ట్రీలో కొంతమందికి నోటీసులు రావటం వాస్తవమే, అయితే నోటీసులు రాని వారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటం బాధాకరం అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు, కానీ చేయని వారిని నిధించటం సరికాదు, నోటీసులు అందిన వారి పేర్లను వేసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరారు శివాజీ రాజా. -
'మా' అధ్యక్షుడిగా శివాజీరాజా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన 'మా' ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొత్త కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హీరో శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరేశ్ ఎన్నికయ్యారు. సినిమా పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు కృషితో ఈసారి పోటీ లేకుండా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని నరేశ్ ఇంతకుముందు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్త కమిటీ అధ్యక్షుడిగా శివాజీరాజా పేరును 'మా' కమిటీ, ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీనికి 'మా' సభ్యులు, సలహాదారులు అంగీకరించారు. శివాజీరాజా మాట్లాడుతూ ఎన్నికల్లో మేము 10శాతం హామీలిచ్చాం. కానీ కళాకారుల శ్రేయస్సు కోసం 100శాతం కృషి చేశామన్నారు. గత ఎన్నికల్లో 'మా' రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ పై జయసుధ పోటీకి దిగడంతో 'మా' ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. చివరకు రాజేంద్రప్రసాద్ ప్యానల్ విజయం సాధించింది. -
చిరునవ్వులతో బతకాలి...
-
'రాజమండ్రిని, గోదావరిని మరువలేను'
కోరుకొండ : రాజమండ్రిని, గోదావరిని తన జీవితంలో ఎన్నడూ మరువలేనని సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. కోరుకొండ మండలం గాదరాడ ఓం శివశక్తి పీఠం దర్శించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. గోదావరి జీవనది అని, ఇక్కడి ప్రజలు అదృష్టవంతులని అన్నారు. గత పుష్కరాల్లో రాజమండ్రిలో పుణ్యస్నానాలు చేశామని, మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేస్తానని చెప్పారు. రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రించిన ‘ప్రేమించు పెళ్ళాడు’ చిత్రంలో తాను హీరోగా చేశానన్నారు. అలాగే, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, పెళ్ళిపుస్తకం, బృందావనం, మీ శ్రేయాభిలాషి, ఆ నలుగురు తదితర అనేక చిత్రాలు ఈ ప్రాంతంలో చేశానన్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా తీసిన శ్రీమంతుడు, నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా తీసిన చిత్రాల్లో ఇటీవల నటించానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు త్వరలో లండన్ వెళ్తున్నానన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట సినీనటుడు రావి కొండలరావు, ఓం శివశక్తి పీఠం ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు, ఆలయ ఈఓ డి.శర్మ, సీఈఓ వి.దినకర్ తదితరులున్నారు. -
'శ్రీవారి' కృపతోనే ...
తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కృపతోనే తాను మా ఎన్నికల్లో విజయం సాధించానని ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం తిరుమలలో శ్రీవారిని రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలిలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు చోటు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలిలో దర్శకేంద్రుడికి చోటు కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా కార్యవర్గ సభ్యులు కూడా స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఆలయం బయట రాజేంద్రప్రసాద్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. -
ప్రమాణస్వీకారం చేసిన రాజేంద్రప్రసాద్ ప్యానల్
-
'మా' అధ్యక్షుడిగా రాజేంద్రుడు
-
'మా' అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ప్రమాణం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ చేత మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పాటు మా నూతన కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. గత రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాల్లో రాజేంద్ర ప్రసాద్ సమీప ప్రత్యర్థి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన సంగతి తెలిసిందే. మార్చి 29న జరిగిన మా ఎన్నిక జరిగినా.. కొన్ని అనివార్య కారణవల్ల ఫలితాల విడుదల ఏప్రిల్ 17 వరకూ వాయిదా పడ్డాయి. -
మా కిరీటం రాజేంద్రుడికే!
వివాదాలకు నెలవై, కొద్దివారాలుగా చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కార్యవర్గ ఎన్నికల్లో సినీ నటుడు రాజేంద్రప్రసాద్, ఆయన ప్యానెల్ ఘనవిజయం సాధించింది. మార్చి 29న ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టు వివాదంతో ఆగిన కౌంటింగ్ న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జరిగింది. హైదరాబాద్‌లో ఎ.పి. ఫిల్మ్ చాంబర్ ప్రాంగణంలో ఉత్కంఠభరితంగా 7 రౌండ్లుగా సాగిన ఓట్ల లెక్కింపులో అధ్యక్ష పదవి అభ్యర్థి రాజేంద్రప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. చివరకు సమీప ప్రత్యర్థి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి ‘మా’ ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా కాదంబరి కిరణ్, ఏడిద శ్రీరావ్‌ు కూడా ఎన్నికయ్యారు. జయసుధ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా తనికెళ్ల భరణి, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా నటులు సీనియర్ నరేశ్, రఘుబాబు గెలుపొందారు. ‘మా’ ఎన్నికల వ్యవహారంపై కోర్టుకెళ్ళిన నటుడు ఒ.కల్యాణ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడి, తనికెళ్ళ భరణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక, శివాజీరాజా తోటి నటుడు అలీ కన్నా 36 ఓట్లు ఎక్కువ సాధించి, ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోల్ అయిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌కు 237 ఓట్లు రాగా, జయసుధకు 152 ఓట్లు, మూడో అభ్యర్థి ‘బొమ్మరిల్లు’ ఫేవ్‌ు ధూళిపాళకు కేవలం 5 ఓట్లు వచ్చాయి. కాగా, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్లుగా ఎన్నికైనవారిలో బెనర్జీ, బ్రహ్మాజీ, చార్మి, ఢిల్లీ రాజేశ్వరి, ‘మహర్షి' రాఘవ, శశాంక, గీతాంజలి, హరనాథ్‌బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కృష్ణుడు, నర్సింగ్‌యాదవ్, పసునూరి శ్రీనివాస్, రాజీవ్ కనకాల, విద్యాసాగర్ గెలుపొందారు. మొత్తం 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గాను 16 మంది జయసుధ ప్యానెల్ నుంచి ఇద్దరు రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి విజయం సాధించారు. కాగా, ‘మా’ ఉపాధ్యక్షు లుగా సినీ నటులు శివకృష్ణ, మంచు లక్ష్మి పోలింగ్ కన్నా ముందే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నూతన కార్యవర్గం 2017 వరకు రెండేళ్ళపాటు బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘మా’లో మాకు విభేదాలు లేవు - మురళీమోహన్ కాగా, ఇప్పటి వరకు ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరించి, జయసుధ ప్యానెల్‌ను సమర్థించిన నటుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్, ఎలక్షన్ అధికారి కృష్ణమోహన్‌తో కలసి ఎన్నికల ఫలితాలను మీడియా ముందు ప్రకటించారు. ‘‘పోటీ అనేది ఎన్నికల వరకే. మాలో మాకు విభేదాలు లేవు. అందరం కలసి కూర్చొని, ‘మా’ అభివృద్ధికి కృషి చేస్తాం’’ అని ప్రకటించడం విశేషం. ప్రతి హామీ నెరవేరుస్తాం - రాజేంద్రప్రసాద్, ‘మా’ అధ్యక్ష పోటీలో విజేత ‘‘ఈ గెలుపు నాది కాదు. నాకు ఒట్లేసిన వారందరిదీ. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సినిమా కళాకారులందరూ ఆనందోత్సాహాలతో, నవ్వుతూ బతకాలన్నదే నా కోరిక. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తా. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి, అందరినీ కలుపుకొని పనిచేస్తా. అసోసియేషన్ మేలు కోసం పరిశ్రమలోని పెద్దవాళ్ళనూ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ కలుస్తాను. ‘మా’ సభ్యుల్లో అర్హులందరికీ పెన్షన్, ఆరోగ్యబీమా అందేలా చూస్తాం. ‘మా’కు అందమైన గూడు సమకూరేందుకు కృషి చేస్తా.’’ -
'మా' ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘన విజయం
-
'మా' అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్
ఆసక్తికరంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. తనపై పోటీ చేసిన జయసుధ మీద ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మార్చి 29వ తేదీన జరిగిన మా ఎన్నికల్లో మొత్తం 702 మంది సభ్యులకు గాను 394 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరోరౌండు పూర్తయ్యే సరికే ఆయన స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. చివరకు ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన జయసుధ మీద 85 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో రాజేంద్రప్రసాద్ అభిమానులు, ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ప్రతి రౌండులోనూ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ప్రధానంగా మురళీమోహన్ మీద వ్యతిరేకత కారణంగానే రాజేంద్రప్రసాద్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఎక్కువ కాలం పాటు మా అధ్యక్ష పదవిని మురళీమోహన్ అనుభవించారు. ఆయన చేతిలో గతంలో రాజేంద్రప్రసాద్ ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల సందర్భంగా భారీ స్థాయిలో వాద ప్రతివాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపించాయి. రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ నటుడు, నిర్మాత ఓ. కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 29న ఎన్నికలు జరిగాయి. తర్వాత ఫలితాల విడుదలకు కూడా కోర్టు ఆమోదం తెలిపింది. దాంతో శుక్రవారం నాడు ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. -
'మా' ఎన్నికల్లో 'జయ'భేరి
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, వివాదాస్పదంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల్లో నటి జయసుధ విజయభేరి మోగించారు. ఈ అసోసియేషన్‌కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. మొత్తం 702 మంది సభ్యులున్న 'మా' అధ్యక్ష పదవికి ఆమెతో నటుడు రాజేంద్రప్రసాద్ పోటీపడ్డారు. మా ఎన్నికలు రెండేళ్లకోసారి జరుగుతాయి. మార్చి 29వ తేదీన జరిగిన ఎన్నికల్లో 394 మంది సభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైనా.. దాన్ని కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ చాంబర్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. .......గంటలకే ఫలితాలను వెల్లడించారు. ఇందులో జయసుధ .... ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్‌ను ఓడించారు. జయసుధకు ... ఓట్లు రాగా, రాజేంద్రప్రసాద్‌కు ... ఓట్లు వచ్చాయి. నటరాజు చూసుకుంటాడు ''మంచికోసం, మార్పుకోసం ధర్మయుద్ధానికి దిగాం. ఈ ధర్మయుద్ధంలో నటరాజు తీర్పు ఎలా ఉన్నా అది పదిమందికీ ఉపయోగపడాలని నా కోరిక, అలా జరుగుతుందని నా ఆశ. మిగతా సంగతి నటరాజు చూసుకుంటాడు'' అని కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.