
కల్పిక, అభిరామ్ వర్మ, అదితీ
సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద్ థాట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏకమ్’ . ది జర్నీ ఆఫ్ ఏ జాబ్‌లెస్ గాడ్ అనేది ఉపశీర్షిక. వరుణ్ వంశీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. కళ్యాణ్ శాస్త్రి, పూజ, శ్రీరామ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివుని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం టీజర్‌ను ‘మా’ అధ్యక్షుడు నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. ఈ ’ఏకమ్’ చిత్రం కూడా కొత్తగా కనబడుతోంది’ అన్నారు. ‘‘న్యూ జోనర్, క్లాసికల్ చిత్రంగా తెరకెక్కుతోంది.
వరుణ్‌గారు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు హీరో అభిరామ్ వర్మ. వరుణ్ వంశీ మాట్లాడుతూ– ‘‘కళ్యాణ్ శాస్త్రిగారు నాకు పదకొండేళ్లుగా తెలుసు. ఆయన నా గురువు కూడా. ‘ఏకమ్’ సినిమా విషయానికి వస్తే పంచభూతాల ఆధారంగా సినిమా స్టోరీ ఉంటుంది’’ అన్నారు. కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ – ‘‘మా అమ్మాయి పేరునే నా బ్యానర్‌కు పెట్టడం జరిగింది. అందుకు కారణం మాత్రం వరుణ్. అతను నా శిష్యుడు. చిన్నప్పటి నుంచి కథలు బాగా చెప్పేవాడు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా చూపించాలనే తపన, టాలెంట్ వరుణ్‌కు ఉన్నాయి. అదే నమ్మకం నన్ను ప్రొడక్షన్ వైపు నడిపించింది’’ అన్నారు. సంస్థ బేనర్‌ను రాజ్ కందుకూరి, అనిల్ సుంకర విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment