
'మా' అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ప్రమాణం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 'మా' అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ చేత మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పాటు మా నూతన కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు.
గత రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాల్లో రాజేంద్ర ప్రసాద్ సమీప ప్రత్యర్థి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన సంగతి తెలిసిందే. మార్చి 29న జరిగిన మా ఎన్నిక జరిగినా.. కొన్ని అనివార్య కారణవల్ల ఫలితాల విడుదల ఏప్రిల్ 17 వరకూ వాయిదా పడ్డాయి.