
'శ్రీవారి' కృపతోనే ...
తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కృపతోనే తాను మా ఎన్నికల్లో విజయం సాధించానని ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం తిరుమలలో శ్రీవారిని రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలిలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు చోటు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలిలో దర్శకేంద్రుడికి చోటు కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా కార్యవర్గ సభ్యులు కూడా స్వామి వారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఆలయం బయట రాజేంద్రప్రసాద్తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.