
ఆ నాన్నను నేనే..
తిరుమల: ‘ఆ నాన్నను నేనే’ అని నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర విశేషాలను ముచ్చటించారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మాట్లాడుతూ నాన్నకు ప్రేమతో చి త్రం ప్రపంచ వ్యాప్తంగా విజయవం తం అయ్యిందన్నారు. తన 37 ఏళ్ల సినీ జీవితంలో నాన్న పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.
ఆ పాత్రను ప్రేక్షకులు బాగా ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. నాన్నపాత్రను దర్శకుడు సుకుమార్ ఎంతో ఇష్టపడి రాసుకుని అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. తలనీలాల మొక్కు చెల్లించుకుని, శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.