tie-up
-
‘మా’తో బాలీవుడ్ ఒప్పందం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కలిసి, రెండు అసోసియేషన్లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతి΄ాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ‘‘త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి’’ అన్నారు మంచు విష్ణు. -
టై కట్టుకోలేదని ఎంపీని బయటకు పంపేశారు
వెల్లింగ్టన్: డ్రెస్సింగ్ సరిగా లేదని, టై కట్టుకోలేదన్న కారణంతో ఎంపీని స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ నిబంధనలకు విరద్ధంగా వ్యవవహరించారని, సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మావోరీ పార్టీకి చెందిన రవైరి వైటిటి అనే ఎంపీ సభలో చర్చ జరిగే సమయంలో ఓ ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా, స్పీకర్ అందుకు అంగీకరించలేదు. మరోసారి ప్రశ్నను లేవెనెత్తుతండగా, మీకు సభలో మాట్లాడే హక్కు లేదని స్పీకర్ హుకం జారీ చేశారు. (ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా?) నిబంధనలను విరుద్దరంగా డ్రెసింగ్ ఉందని, టై కట్టుకోని కారణంగా సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. స్పీకర్ తీరుతో అవాక్కయిన సదరు ఎంపీ సభ నుంచి బయటకు రాక తప్పలేదు.న్యూజిలాండ్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా టై ధరించాలని నిబంధన ఉంది. (ట్రంప్‌తో ఉన్న క్షణాలు అత్యంత చెత్త సమయం: పోర్న్‌స్టార్) -
ఐడియా: ఆరునెలలు 6జీబీ డేటా ఫ్రీ ...ఎలా?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఆపరేటర్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారీ సంస్థ ఐటెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలకు 1 జీబీ డ్యాటాను ఆరు నెలలపాటు ఉచితంగా అందించనుంది. అంతేకాదు ఈ ఆఫర్ ఈ రోజునుంచే ( బుధవారం) చెల్లుబాటులోకి రానుందని ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా ఐటెల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఐటెల్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో మాత్రమే అందుబాటులోఉంటుంది. దేశవ్యాప్తంగా పెద్దమొత్తం వినియోగదారులకు దీని మూలంగా లాభం చేకూరనుందనే విశ్వాసాన్ని ఐటెల్ సీఈవో సుధీర్ కుమార్ వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో మన జీవితాలు డిజిటల్ ప్లాట్ ఫాంలోకి మారిపోతున్నాయన్నారు . ఈ క్రమంలో ఐటెల్, ఐడియా యూజర్లకు సరసమైన ధరలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఆఫర్ పొందాలంటే యూజర్లు ఐటెల్ స్మార్ట్ ఫోన్ల లోని ఐడియా ద్వారా http://i4all.ideacellular.com/offers సైట్‌ను సందర్శించాలని కోరింది. అనంతరం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేస్తే.. యూజర్ డివైజ్ ఐఎంఈఐ, ఫోన్ నెంబర్ వెబ్ సైట్ గుర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ షో మై ఆఫర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి, 1 జీబీ ఆఫర్ ను సెలెక్ట్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందని తద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ లో మొదటి నెల డాటా పూర్తిగా ఉచితం. ఆ తర్వాత ఆరునెలలు వరుసగా నెలలు 1 జీబీ డాటా ఫ్రీ. అలాగే నెలకు రూ. 50 లేదా అంతకు మించి ప్యాక్‌లు చెల్లించడం ద్వారా అదనపు డేటా, లేదా వాయిస్ కాల్స్‌ను పొందవచ్చని తెలిపింది. మరోవైపు టవర్ల బిజినెస్‌ను కొనుగోలు చేసే యోచనలో అమెరికన్ టవర్ కంపెనీ(ఏటీసీ) అధికారులు ప్రస్తుతం ఐడియాతో చర్చలు జరుపుతోందిట. అటు వొడాఫోన్తో విలీనానికింటే ముందుగానే టవర్ల డీల్‌ను కుదుర్చుకోవాలని ఐడియా యాజమాన్యం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఇంట్రాడేలో ఐడియా షేరు 10 శాతం లాభపడింది. -
ఓలా క్యాబ్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్
న్యూఢిల్లీ: ఓలా క్యాబ్స్‌లో రైడింగే కాదు అవసరమైతే కార్డులను స్వైప్ చేసి నగదు పొందవచ్చు. ఇందుకు వీలుగా ఓలా క్యాబ్స్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులతో టై అప్ అరుుంది. హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభమయ్యాయని ఓలా తెలిపింది. ట్యాక్సీలో ఓ బ్యాంకు అధికారి ఉంటారని, వివిధ ప్రాంతాలకు పీఓఎస్ మెషీ న్ను తీసుకెళ్లడం ద్వారా ఓ కార్డుపై రూ.2,000 వరకు నగదు అందించనున్నట్టు వివరించింది. -
‘ఫోర్స్-2’తో దివిసా హెర్బల్ కేర్ జట్టు
హైదరాబాద్: దివిసా హెర్బల్ కేర్ తాజాగా ఫోర్స్-2 సినిమాతో టైఅప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ తన అక్యుమస్ ప్రొడక్ట్ ద్వారా చిత్రం ప్రచారంలో పాలుపంచుకుంటుంది. చిత్రంలో హీరో హీరోరుున్లు వారికి ఎదురైన సమస్యలను ఎంతో విశ్వాసంతో ధైర్ఘంగా ఎదుర్కొన్నారని, ఇదే తరహాలో తమ అక్యుమస్ ఆయుర్వేదిక్ గ్రాన్యూల్స్ ప్రొడక్ట్ కూడా ప్రజలను తక్కువ బరువు, సన్నని శరీరం వంటి తదితర సమస్యల నుంచి కాపాడుతుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అక్యుమస్ ప్రొడక్ట్‌ను 18 అయుర్వేద మూలికలతో తయారు చేశామని, ఇది సహజసిద్ధంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని వివరించింది. -
బెంగాల్లో కాంగ్రెస్ పొత్తు ఎవరితో?
న్యూఢిల్లీ: మరో ఐదు నెలల్లో పశ్చిమ బెంగాల్‌కు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. క్రితంలాగే పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా లేదా సీపీఎం పార్టీతో పొత్తుపెట్టుకోవాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై సీపీఎం, కోల్‌కతాలో ప్రస్తుతం జరగుతున్న పార్టీ ప్లీనరీలో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తామేమి వ్యతిరేకం కాదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకుడు కారత్ ఇప్పటికే వ్యక్తం చేశారు. సీపీఎంతో పెట్టుకోవడం మంచిదని బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం బలంగా కోరుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీతో పొత్తుపెట్టుకోవడమే అన్ని విధాల కలిసొచ్చే అంశమని వారు భావిస్తున్నారు. దీనికి రెండు కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇటీవల ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పార్టీతో తృణమూల్ కలసిరావడం. నేషనల్ హెరాల్డ్ వివాదంలో కాంగ్రెస్ పార్టీకీ తృణమూల్ అండగా నిలవడమే కాకుండా కాంగ్రెస్‌తోపాటు సమావేశాలను బాయ్‌కాట్ చేయడం తెల్సిందే. మరో కారణం...కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నాయకత్వంలోని ఎల్డీఎఫ్ను ఎదుర్కోవాల్సి ఉండడం. ఓ రాష్ట్రంలో వైరి వైఖరి, మరో రాష్ట్రంలో మిత్ర వైఖరి సరిపడదంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిప్రాయం. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎంత సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నా బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం వినిపించుకోవడం లేదు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. పాలకపక్షంతో వెళితే మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు ఉండడమే అందుకు కారణం. 2011లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌తో కలసి పోటీ చేయడం వల్ల మొత్తం 65 సీట్లకు పోటీచేసి 42 సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే. -
బీజేపీకి 'బొమ్మ' చూపించిన టీడీపీ
-
బీజేపీ-టీడీపీల పొత్తు పై నేడు తుది ప్రకటన
-
ఒంటరిపోరుకు సిద్దమన్న సంకేతాలు
-
కేసిఆర్‌కు సీఎం పదవి ఇస్తామంటేనే చర్చలు
-
చంద్రబాబుతో కుదిరేలా లేదు
-
బిజేపీ అగ్రనాయకత్వం