వెల్లింగ్టన్: డ్రెస్సింగ్ సరిగా లేదని, టై కట్టుకోలేదన్న కారణంతో ఎంపీని స్పీకర్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ నిబంధనలకు విరద్ధంగా వ్యవవహరించారని, సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మావోరీ పార్టీకి చెందిన రవైరి వైటిటి అనే ఎంపీ సభలో చర్చ జరిగే సమయంలో ఓ ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా, స్పీకర్ అందుకు అంగీకరించలేదు. మరోసారి ప్రశ్నను లేవెనెత్తుతండగా, మీకు సభలో మాట్లాడే హక్కు లేదని స్పీకర్ హుకం జారీ చేశారు. (ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా?)
నిబంధనలను విరుద్దరంగా డ్రెసింగ్ ఉందని, టై కట్టుకోని కారణంగా సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. స్పీకర్ తీరుతో అవాక్కయిన సదరు ఎంపీ సభ నుంచి బయటకు రాక తప్పలేదు.న్యూజిలాండ్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా టై ధరించాలని నిబంధన ఉంది. (ట్రంప్‌తో ఉన్న క్షణాలు అత్యంత చెత్త సమయం: పోర్న్‌స్టార్)
Comments
Please login to add a commentAdd a comment