
సాక్షి, విజయవాడ: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై నటి హేమ తాజాగా స్పందించారు. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు(గురువారం) ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా తాను ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు
ఈ మేరకు ఆమె ‘మా’ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రాత్రి గెలిచామని చెప్పి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదని, దానికి కారణం దుర్గమ్మకైనా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితాలపై చేసిన వరుస ట్వీట్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికలు జరిగిన రోజు అక్టోబర్ 10న రాత్రి వీరిద్దరూ గెలిచినట్లు ప్రకటించి.. మరుసటి రోజు వారు ఓడిపోయినట్లు తెలిపారు. దీంతో ‘మా’ ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు
Comments
Please login to add a commentAdd a comment