Dil Raju Meets MAA President Manchu Vishnu, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Manchu Vishnu-Dil Raju: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో దిల్‌ రాజు భేటీ

Published Thu, Aug 4 2022 1:35 PM | Last Updated on Thu, Aug 4 2022 2:29 PM

Dil Raju Meets MAA President Manchu Vishnu - Sakshi

మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్‌ రాజు సమావేశమయ్యారు. గురువారం ఉదయం మా కార్యాలయానికి వెళ్లిన దిల్‌ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్‌ బంద్‌పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరు ఆయన ట్వీట్‌ చేశారు. దిల్‌ రాజును కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు.

చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్‌ రామ్‌

ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్‌ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్‌ రాజుకు అందించారు. కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్‌ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్‌ రాజుతో భేటి అయినట్లు సమాచారం. 

చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు హఠాన్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement