ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు | Manchu Vishnu Respond On Prakash Raj Panel Resignations In Oath Ceremony | Sakshi
Sakshi News home page

MAA Oath Ceremony: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు

Published Sat, Oct 16 2021 2:47 PM | Last Updated on Sat, Oct 16 2021 4:24 PM

Manchu Vishnu Respond On Prakash Raj Panel Resignations In Oath Ceremony - Sakshi

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌పై ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఈ రోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు ప్రకటించిన మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతీ అంశం అమలు జరిగేలా చూస్తానని హామి ఇచ్చారు.

చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!

అలాగే ‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని ‘మా’ కార్యవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తరువాత రోజు ప్రకాశ్‌ రాజ్‌తో పాటు ఆయన ప్యానల్‌ నుంచి గెలిచిన, ఓడిన సభ్యులు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. దీనిపై మంచు విష్ణు స్పందించారు.

చదవండి: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

‘‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. పత్యర్థి ప్యానల్‌ వాళ్లు దీన్ని గౌరవించాలి. ఎన్నిక ఫలితాల అనంతరం పత్యర్థి ప్యానల్‌ వాళ్లు రాజీనామాలు చేశారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది చాలా దురదృష్టకరం. అయితే ‘మా’ అభివృద్ధి కోసం వారిని కలుపుకోనిపోతాం. ‘మా’ అసోసియేషన్‌ అభివద్ధికి కోసం ఏ కార్యక్రమాలను చేపట్టిన వారి సలహా తీసుకుంటాను. వారి సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో తనకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తాను, తన టీం కానీ ‘మా’ ఎన్నికల గురించి మీడియాలో మాట్లాడమని, కేవలం తాము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతామంటూ విష్ణు వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement