Theft In Manchu Vishnu 'MAA' Office At Film Nagar, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: మంచు విష్ణు కార్యాలయంలో చోరీ, అతడిపైనే అనుమానం

Published Mon, Feb 28 2022 8:11 AM | Last Updated on Mon, Feb 28 2022 9:23 AM

Theft In Manchu Vishnu Office At Film Nagar - Sakshi

ఫైల్‌ ఫొటో

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. ఫిల్మ్‌‌‌నగర్‌లోని మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించడం లేదని  మంచు విష్ణు మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.

రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్‌ డ్రెస్పింగ్‌ సామాగ్రిని దుండగులు దొంగలించినట్లు మేనేజర్‌ సంజయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగినప్పటి నుంచి హెయిర్‌ డ్రెస్సర్‌ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండోచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. మరి ఈ సంఘటనపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement