
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రాజకీయ వేదిక కాదని, కళాకారుల వేదికని మోహన్ బాబు అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. విష్ణు, అతని ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
చదవండి: ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగగలరు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను’ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ‘ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఇది రాజకీయ వేదిక కాదు, కళకారుల వేదిక. పాలిటిక్స్‌లో ఉన్నవి కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయని, ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయానన్నారు.
చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
‘ఇక్కడ నువ్వు గొప్పా.. నేను గొప్పా.. సినిమాలు ఉన్నాయా, లేవా అన్నది కాదు. ఎంత కష్టపడి సినిమా చేసిన ఒక్కోసారి ప్లాప్స్ వస్తుంటాయి. జయాపజయాలు సహజం. సక్సెస్ వచ్చిందని విర్రవీగితే ఆ మరుక్షణమే దేవుడు దిమ్మతిరిగేటట్లు కొడతాడు. ‘మా’ ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నా బిడ్డను గెలిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాకు పగ, రాగద్వేషాలు లేవు. నా తెలివి తేటలతో, క్రమ శిక్షణతో ఇక్కడి వరకు వచ్చాను.
చదవండి: ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
పరిశ్రమ పెద్దలను గౌరవించాలని, అందుకే ఇక్కడికి వచ్చే ముందు తాను కృష్ణగారిని కలిపి వచ్చానన్నారు. అలాగే 600 మందికి కూడా ఫోన్ చేసినట్లు చెప్పారు. భారతదేశం గర్వించేలా ‘మా’ ఖ్యాతిని పెంచాలని, ‘మా’ సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి మాట్లాడతానన్నారు. ఇది మన అసోసియేషన్, నూతన కార్యవర్గానికి మీ సహాయసహకారాలు ఎంతో అవసరమన్నారు. ‘మా’ అధ్యక్షుడు అనేది చిన్న ఉద్యోగం కాదని, ఒక పెద్ద బాధ్యత అన్నారు. ఎంతో మంది మహామహులు దీన్ని ఏర్పాటు చేశారు. కార్యవర్గంలోని సభ్యులందరికీ తాను చెప్పేది ఒక్కటేనని, మీలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రెసిడెంట్‌తో చెప్పి సమస్యలను పరిష్కరించుకోండి. అంతేకానీ, టీవీలకు ఎక్కొద్దంటూ’ మోహన్‌బాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment