MAA AP Founder President Dileep Raja Comments On Elections - Sakshi
Sakshi News home page

‘మా ఏపీ’ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

Published Fri, Jan 7 2022 8:28 AM | Last Updated on Fri, Jan 7 2022 10:34 AM

MAA AP Founder President Dileep Raja Comments On MAA AP Elections - Sakshi

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌’ (మా ఏపీ) ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రస్తుత కార్యవర్గంలో ప్రెసిడెంట్‌గా నటి కవిత, ప్రధాన కార్యదర్శిగా నరసింహ రాజు, కార్యదర్శిగా అన్నపూర్ణల పదవీ కాలం ముగిసింది. కరోనా వల్ల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయాం. 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ‘మా ఏపీ’లో సభ్యులుగా ఉన్నారు. 24 విభాగాల్లోని ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తును ‘మా ఏపీ’ కార్యాలయానికి పంపవచ్చు. ఎన్నికల తేదీని మార్చి 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారు’’ అని దిలీప్‌ రాజా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement