
వరుసగా ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరో, డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారంటే అది వారిద్దరికీ పరీక్షే. టాలీవుడ్‌లో వరుసగా పరాజయాలను చవిచూస్తున్న రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మంచి హిట్‌లు వచ్చాయి. అయితే మళ్లీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్ చెప్పే మాటలు.. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్. ఇలియానా అందాలు కూడా మరో ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి. ఈ టీజర్ అంచనాలను పెంచేలా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 16న విడుదల కానుంది.
Here it is! #AAATeaser @SreenuVaitla @MythriOfficial @MusicThaman @Ileana_Officialhttps://t.co/W04MEvfJVz
— Ravi Teja (@RaviTeja_offl) October 29, 2018
Comments
Please login to add a commentAdd a comment