మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా చేస్తున్నాడు. 1970ల్లో మన దేశంలోనే పెద్ద దొంగగా అందరినీ భయపెట్టిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఈ మూవీ. దసరా సందర్భంగా అక్టోబరు 20న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. అలానే టైగర్ దండయాత్ర పేరుతో గురువారం ఓ టీజర్ ని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!)
టీజర్ ఎలా ఉంది?
1970ల వాతావరణాన్ని ప్రతిబింబించేలా టీజర్‌లోని ప్రతి షాట్ కనిపిస్తుంది. స్టువర్ట్‌పురం దొంగగా రవితేజ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అనుపమ్ ఖేర్, మురళీశర్మ.. పాత్రల‍్ని కూడా టీజర్ లో చూపించారు. 'పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు' లాంటి డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి.
కథేంటి?
హైదరాబాద్, బాంబే, ఢిల్లీతో పాటు అనేక నగరాల్లో దారుణమైన దోపిడీలు చేసిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు.. మద్రాసు సెంట్రల్ జైలులో ఉంటాడు. ఓ రోజు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అతడిని పట్టుకునే బాధ్యతని డీసీపీ మురళీశర్మకు అప్పగిస్తారు. ఈ క్రమంలోనే చివరకు ఏమైంది? అనేది స్టోరీ అని తెలుస్తోంది. మొన్నటివరకు ఈ సినిమా డైరెక్టర్ పేరు చెప్పకుండా సస్పెన్స్ మెంటైన్ చేశారు కానీ ఇప్పుడు వంశీ దర్శకుడు అని టీజర్‌లో చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!)
Comments
Please login to add a commentAdd a comment