‘అఅఆ’లో డాన్‌బాస్కో కాస్తా.. డాన్‌బ్రాస్కోగా మారింది! | Raviteja Amar Akbar Anthony Song Lyrics changed | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 12 2018 2:16 PM | Last Updated on Mon, Nov 12 2018 2:25 PM

Raviteja Amar Akbar Anthony Song Lyrics changed - Sakshi

సినిమాలోని పాటల్లో, మాటల్లో కొన్ని పదాలు వాడటంతో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో ఇలా ఎన్నో పాటలు, మాటలు సినిమాల్లోంచి తీసేయడమో లేదా వాటిని మార్చడమో జరగుతూ వచ్చాయి. అదుర్స్‌, రంగస్థలం పాటలే ఇందుకు ఉదాహరణ. ఆ సినిమాలోని పాటలు కొందరి మనోభావాలు దెబ్బతినడంతో వాటి లిరిక్స్‌ను మార్చేశారు. 

తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ‘అమర్‌అక్బర్‌ఆంటోని’లోని డాన్‌బాస్కో పాటలోని పదాన్నికూడా మార్చబోతున్నట్లు ప్రకటించారు. డాన్‌బాస్కో అనే మత గురువు పేరిట ఉన్న డాన్‌బాస్కో సేవా సంస్థ విజ్ఞప్తి మేరకు.. ఆ పదాన్ని మార్చుతూ.. డాన్‌బ్రాస్కోగా కొత్త లిరిక్‌తో సాంగ్‌ వస్తుందంటూ మేకర్స్‌ తెలిపారు. ఇలియాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 16న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement