
రకుల్‌తో ప్రేమ పాట!
రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ యూరప్‌లో ప్రేమ పక్షుల్లా ఆడిపాడనున్నారు. కంగారు పడకండి...! సినిమా కోసమే ఇదంతా! శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం కోసం గురువారం నుంచి వీరిద్దరిపై యూరప్‌లో పాటలు చిత్రీకరించనున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని శ్రీనుై వెట్ల అభివర్ణించారు. యూరప్‌లో పాటలు తీశాక జూన్‌లో హైదరాబాద్ షెడ్యూల్ చేస్తామని దానయ్య తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: డి. పార్వతి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై. ప్రవీణ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ.