
యూరప్‌లో `ఖైదీ నంబర్ 150` సాంగ్ షూట్..
మెగాస్టార్ `ఖైదీ నంబర్ 150` జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. . కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ బాస్ అంతే స్పీడ్ చూపించడం సౌత్ ఇండస్ట్రీస్, ఓవర్సీస్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం యూరప్‌లో పాటల చిత్రీకరణకు యూనిట్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ ఖైదీ నంబర్ 150 పాటల చిత్రీకరణకు యూరప్ వెళుతున్నట్టుగా తెలిపారు. స్లోవేనియా, క్రొయేషియా (సెంట్రల్ యూరప్) లాంటి అరుదైన దేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించనున్నారు.
జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ పాటలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోటతరణి కళాదర్శకత్వం వహిస్తున్నారు.