
మెగా ఆడియోకి ముహూర్తం ఫిక్స్
మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ రోజు.., ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినీ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొనే ఈ ఈవెంట్కు ముహుర్తం వేదిక ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ శుక్రవారం రామ్చరణ్ ధృవ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో పాటు ఖైదీ నంబర్ 150 ట్రైలర్ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆ తరువాత డిసెంబర్ 25న ఈ సినిమా ఆడియో వేడుకను మెగా అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తుండగా, మాస్ సినిమాల స్పెషలిస్ట్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.