
ఖైదీ నంబర్ 150లో బన్నీ కూడానా..?
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. దాదాపు పదేళ్ల విరామం తరువాత చిరు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావంటతో మెగా అభిమానులు సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా చిరు ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించారు చిత్రయూనిట్.
ఈ భారీ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సెకన్ల పాటు చిరు తో కలిసి డ్యాన్స్ చేశాడు చెర్రీ. అయితే ఇప్పటి వరకు రివీల్ చేయని విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. చరణ్తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో కనువిందు చేయనున్నాడట. మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఖైదీ నంబర్ 150 సక్సెస్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చరణ్తో పాటు అల్లు అర్జున్ కూడా చిరు సినిమాలో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు.