
చరణ్ కాదు చిరునే..!
మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్లో బిజీగా ఉంది. మెగా సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఆడియో వేడుక లేకుండా పాటలను డైరెక్ట్గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ పాట యూట్యూబ్ సెన్సేషన్గా మారింది.
ఇప్పుడు సుందరీ అనే పాటను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ పాట రిలీజ్ చేస్తున్నారు అన్న న్యూస్ కన్నా.. ఆ విషయాన్ని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పోస్టర్లో చిరు అచ్చు చరణ్ లాగే కనిపిస్తున్నాడు. మరింత యంగ్గా స్టైలిష్గా కనిపిస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్. 61 ఏళ్ల వయసులోనే చిరు గ్లామర్ లుక్స్తో ఆకట్టుకోవటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.