
చెర్రీ డాన్సులు అదరహో!
ఐదే ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసేయాలన్నది డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రబృందం టార్గెట్. ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేసేయాలని ఫిక్సయ్యారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్టోబర్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో రామ్‌చరణ్ లుక్ చాలా వెరైటీగా ఉంటుందని టాక్. ఇక, చరణ్ డ్యాన్సుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన స్టెప్పులేశారు. ఈ చిత్రంలో చరణ్ డ్యాన్సులు అదరహో అనే స్థాయిలో ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.. సో.. అభిమానులకు పండగే పండగ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి.