October 15
-
చెర్రీ డాన్సులు అదరహో!
ఐదే ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసేయాలన్నది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రబృందం టార్గెట్. ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేసేయాలని ఫిక్సయ్యారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్టోబర్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో రామ్‌చరణ్ లుక్ చాలా వెరైటీగా ఉంటుందని టాక్. ఇక, చరణ్ డ్యాన్సుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన స్టెప్పులేశారు. ఈ చిత్రంలో చరణ్ డ్యాన్సులు అదరహో అనే స్థాయిలో ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.. సో.. అభిమానులకు పండగే పండగ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి. -
వచ్చేనెల 15న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
-
వచ్చేనెల 15న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: మరో రెండు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. హర్యానా, మహారాష్ట్ర శాసనసభలకు అక్టోబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే నెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 27 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 1వ తేదీ ఆఖరి గడువు. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లున్నాయి. రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. వరదలు ముంచెత్తుతున్న జమ్మూకాశ్మీర్‌తో పాటు జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించాల్సివుంది.