న్యూఢిల్లీ: మరో రెండు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. హర్యానా, మహారాష్ట్ర శాసనసభలకు అక్టోబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే నెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు.
అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 27 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 1వ తేదీ ఆఖరి గడువు. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లున్నాయి. రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. వరదలు ముంచెత్తుతున్న జమ్మూకాశ్మీర్తో పాటు జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించాల్సివుంది.
వచ్చేనెల 15న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
Published Fri, Sep 12 2014 5:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement