న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్నారు.
ఇక మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 287 సీట్లలో పోటీ చేయగా, బీజేపీ కూటమి 280, శివసేన 282, ఎన్సీపీ 278, ఎంఎన్‌ఎస్ 219 స్థానాల్లో తమ తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ తొలిసారిగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయటం విశేషం. 1.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 19న రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మహారాష్ట్ర, హర్యానాలో కొనసాగుతున్న పోలింగ్
Published Wed, Oct 15 2014 8:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement