సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర (పీపుల్స్‌పల్స్)
బీజేపీ 182,
కాంగ్రెస్ 97,
ఇతరులు 9
మహరాష్ట్ర (ఏబీపీ) :
బీజేపీ 150-170
కాంగ్రెస్ 110-130
ఇతరులు 8-10
ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్)
ఎన్డీయే-46-58
జేఎంఎం కూటమి 24-37
ఇతరులు 6-10
చాణక్య (మహారాష్ట్ర)
ఎన్డీఏ 152-160
ఇండియా 130-138
చాణక్య(ఝార్ఖండ్)
ఎన్డీఏ 45-50
జేఎంఎం 35-38
ఏబీపీ(మహారాష్ట్ర)
ఎన్డీఏ 150-170
ఎంవీఏ 110-130
ఇతరులు 6-8
కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.
ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment