NTR Satha Jayanthi: Chiranjeevi, Jr NTR And Other Tollywood Celebrities Remembering NTR Deets Here - Sakshi
Sakshi News home page

NTR Jayanthi: ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Published Sat, May 28 2022 11:49 AM | Last Updated on Sat, May 28 2022 12:27 PM

Chiranjeevi, Jr NTR And Other Hollywood Celebrities Remembering NTR On His Birth Anniversary - Sakshi

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి  కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే  నా  ఘన నివాళి’అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశాడు. 

(చదవండి: పదే పదే తలచు తెలుగుజాతి)

ఇక రామరావు జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ పోస్టులు పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement