Srinu Vaitla: Can Not Imagine My Life Without 3 Musketeers - Sakshi
Sakshi News home page

Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన డైరెక్టర్‌

Published Sat, Jul 23 2022 4:25 PM | Last Updated on Sat, Jul 23 2022 6:30 PM

Srinu Vaitla: Can Not Imagine My Life Without 3 Musketeers - Sakshi

నీకోసం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆనందం, సొంతం, ఢీ, రెడీ, దూకుడు, బాద్‌షా చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్‌ లేక సతమతమవుతున్నాడీ డైరెక్టర్‌. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులకు లోనవుతున్నాడు. ఆయన భార్య రూప శ్రీనువైట్లతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే! ఈ వార్త సోషల్‌ మీడియాలో దావానంలా వ్యాప్తించింది.

ఈ క్రమంలో శ్రీనువైట్ల రీసెంట్‌గా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. 'జీవితం చాలా అందమైంది. నచ్చిన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ ముగ్గురు మరెవరో కాదు.. తన ముగ్గురు కూతుళ్లు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఏం బాధపడకండి సర్‌, తప్పకుండా మీరు కోల్పోయినవి తిరిగి మీకు దక్కుతాయి. ఒక్క హిట్‌ పడితే మిమ్మల్ని కాదని వెళ్లినవాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీకి సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

చదవండి: నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..
నటుడు అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement