'మా లక్ష్మీ చనిపోయింది'.. దూకుడు డైరెక్టర్‌ ట్వీట్‌ వైరల్‌ | Director Srinu Vaitla Farm Cow Lakshmi Passed Away, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Srinu Vaitla Cow Death: 13 ఏళ్లుగా ఎంతగానో ప్రేమించాం.. 'మా లక్ష్మీ చనిపోయింది' అంటూ డైరెక్టర్‌ ట్వీట్‌..

Sep 14 2023 12:30 PM | Updated on Sep 14 2023 12:49 PM

Director Srinu Vaitla Farm Cow Lakshmi Passed Away - Sakshi

టాలీవుడ్‌ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట బాధాకర సంఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో ఒకరిగా భావించిన..

టాలీవుడ్‌ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట బాధాకర సంఘటన చోటు చేసుకుంది. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఆవు చనిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. చాలా బాధగా ఉంది. మేము దాన్ని మా ఇంటి సభ్యురాలిగా చూసుకున్నాం. 13 ఏళ్లుగా దానికి ప్రేమను పంచాము. నా కూతురైతే ఆ ఆవును ఎంతో ప్రేమగా లక్ష్మీ అని పిలిచేది. ఆ ఆవు చనిపోయింది' అంటూ ట్విటర్‌లో దాని ఫోటో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

కాగా శ్రీనువైట్ల 'నీకోసం' సినిమాతో దర్శకరచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్‌షా వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందించాడు. అయితే పది సంవత్సరాల నుంచి అతడికి అస్సలు కలిసి రావడం లేదు. 2014 నుంచి అతడు నాలుగు సినిమాలే చేయగా అవేవీ బాక్సాఫీస్‌ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. 2018లో 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' తీసిన అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలాకాలం గ్యాప్‌ తర్వాత ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరికీ ఈ సినిమా సక్సెస్‌ చాలా అవసరం. ఈ సినిమా ఫలితం ఏమాత్రం తేడాగా ఉన్నా వీరిద్దరి కెరీర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కట్టప్ప తనయుడి సినిమా, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement