హత్యలకు కారణం ఏంటి? | Vijay Antony and Arjun Killer to release in June 7 | Sakshi
Sakshi News home page

హత్యలకు కారణం ఏంటి?

Published Wed, Jun 5 2019 3:03 AM | Last Updated on Wed, Jun 5 2019 3:04 AM

Vijay Antony and Arjun Killer to release in June 7 - Sakshi

‘‘కొన్ని చిత్రాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. కానీ ప్రస్తుతం నేను సంగీతంపై ఆసక్తిగా లేను. ఫోకస్‌ అంతా యాక్టింగ్‌ పైనే పెట్టి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగు బాగా నేర్చుకున్న తర్వాత టాలీవుడ్‌లో స్ట్రెయిట్‌ ఫిల్మ్‌ చేస్తాను’’ అని విజయ్‌ ఆంటోనీ అన్నారు. విజయ్‌ ఆంటోనీ, అర్జున్‌ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో ప్రదీప్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘కొలైగారన్‌’. ఇందులో ఆషిమా కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని ‘కిల్లర్‌’ అనే టైటిల్‌తో టి. నరేష్‌ కుమార్, టి. శ్రీధర్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ నెల 7న కిల్లర్‌ చిత్రం విడుదల కానుంది. విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇందులో సీరియల్‌ కిల్లర్‌ పాత్ర చేశాను. దర్శకుడు ఆండ్రూస్‌ నా క్లాస్‌మేట్‌. ఈ కథ విన్నప్పుడు ఎగై్జట్‌ అయ్యాను. సినిమాలో నేను చెడ్డవాడినా? లేక మంచి వాడినా? అసలు హత్యలకు కారణం ఏంటి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇది పక్కా కమర్షియల్‌ మూవీ. వేరే బ్యానర్‌లో నేను చేసిన తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ‘ఖాకి’, ‘జ్వాల’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement