హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకోను | Being beyond the line did not give up | Sakshi
Sakshi News home page

హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకోను

Published Wed, Sep 30 2015 2:27 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకోను - Sakshi

హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకోను

ఎవరైనా తనతో హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకోను అని అంటున్నారు నటి ఇలియానా. కేడీ చిత్రంతో కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత నన్బన్ చిత్రంలోనే నటించారు. అయితే తెలుగులో ప్రముఖ హీరోలందరితోనూ నటించేశారు. అలాంటి ఈ గోవా సుందరి ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై సీతకన్నేశారు. అలాగని హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారనుకుంటే పొరపాటే. అక్కడ కూడా అమ్మడికి అవకాశాలు నిల్లే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్ చేయడానికి రెడీ అన్నట్లు ప్రచారం జరిగింది. కారణాలేమోగానీ ఆమె ఆ ఐటమ్ సాంగ్ చెయ్యలేదు.

బహూశా బేరం కుదరలేదేమో’ఆ పాటకు ఈ భామ భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని సమాచారం. ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ అవకాశాలు లేని ఇలియానా ఒక తెలుగు నటుడితో ప్రేమాయణం సాగించినట్లు గ్యాసిప్స్ హల్‌చల్ చేశాయి. ఆ తరువాత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే వ్యక్తి ప్రేమలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా చెప్పే కహానీలు చూద్దామా’ నేను అందరితోనూ సన్నిహితంగా మాట్లాడతాను.అంతేకానీ షూటింగ్‌లో ఒక మూల కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. సెట్‌లో సహ నటీనటుల్ని వెతుక్కుటూ వెళ్లి మరీ మాట్లాడతాను. స్నేహం కోసం ప్రాణం అయినా ఇస్తాను.

అందుకే చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ నేనంటే ఇష్టం. అయితే ఇలా నడుచుకోవడంలో మంచి ఎంత ఉంటుందో చెడు అంత ఉంటుంది. మంచి విషయం ఏమిటంటే అంత పెద్ద నటి  అయి ఉండీ ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసిపోతున్నారని ఇతరులు అనుకుంటారు. అభిమానం చూపుతారు. ఇక చెడు ఏమిటంటే నా సాన్నిహిత్యాన్ని కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. అలాంటి నటులతో నేను జాగ్రత్తగా ఉంటాను. వారితో సంబంధాలను ఆదిలోనే తెంచేసుకుంటాను. హద్దులు మీరే వారి చర్యల్ని మొదట్లోనే ఖండించకుంటే ఆ తరువాత మనకే నష్టం. నాతో తప్పుగా ప్రవర్తించాలనుకునే వారి బాడీలాంగ్వేజ్‌ను గ్రహించేస్తాను. రాద్దాంతం జరిగే వరకూ పరిస్థితిని రానివ్వను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement