సాక్షి : మీటూ ఉద్యమం ఊపందుకున్నాక.. చాలా మంది మహిళలు ఫేస్‌బుక్‌లో తమ అనుభవాలను పంచుకోవటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పురుషులను వారు తిట్టిపోస్తుండటంతో వారి అకౌంట్లను ఫేస్ బుక్ బ్లాక్ చేస్తూ వస్తోంది.
ఒక్కోసారి అది వారాల తరబడి కూడా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే త్వరలో అలాంటి వారి అకౌంట్లను పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ఫేస్ బుక్ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పురుషులను ఉద్దేశించి తిట్టడం, పరుష పదజాలం వాడటం, అగౌరవపరిచేలా పోస్టులు పెట్టడం లాంటివి చేస్తే అకౌంట్లను బ్లాక్ చేసేస్తారంట.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు మహిళలు ఫేస్ బుక్ వేదికగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ అకౌంట్లు కూడా బ్లాక్ అయ్యాయని చెబుతుండటం విశేషం. పురుషులు మహిళలను ఉద్దేశించి నీచమైన పోస్టులు చేసినప్పుడు ఫేస్‌బుక్ ఏం చేసిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయమై ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహిళలను మాత్రమే శిక్షించటం సరికాదన్న అభిప్రాయం ఆమె వ్యక్తం చేస్తూ ఓ సుదీర్ఘమైన పోస్టునే ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment