మహిళను తాకినందుకు మూడు నెలల జైలు | Indian jailed for groping woman at metro station | Sakshi
Sakshi News home page

మహిళను తాకినందుకు మూడు నెలల జైలు

Published Wed, Jul 30 2014 7:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

మహిళను తాకినందుకు మూడు నెలల జైలు

మహిళను తాకినందుకు మూడు నెలల జైలు

దుబాయ్: మెట్రో స్టేషన్ లో మహిళను తాకినందుకు ఓ భారతీయుడికి దుబాయ్ కోర్టు  మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత అతడు దుబాయ్ విడిచి వెళ్లిపోవాల్సివుంటుంది. నిందితుడి పేరును జేకే(26) మాత్రమే వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో 40 ఏళ్ల భారత మహిళను బహిరంగంగా తాకాడన్నది అతడిపై నేరారోపణ అని గల్ఫ్ న్యూస్ తెలిపింది. మొదటి తప్పుగా భావించి కోర్టు అతడికి స్వల్ప శిక్ష విధించిందని పేర్కొంది.

అయితే తాను ఉద్దేశపూర్వకంగా మహిళను తాకలేదని కోర్టుకు జేకే తెలిపాడు. ఎస్కలేటర్ పై ఉండగా అదుపుతప్పి ఆమెపై పడ్డాడని చెప్పాడు. ఆమెను తాకాలన్న ఉద్దేశం తనకు ఏకోశానా లేదన్నాడు. జెబెల్ అలీ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతడు కావాలనే తనను తాకాడని, తాను ప్రశ్నించేసరికి బాలెన్స్ తప్పి పడిపోయినట్టు సాకు చెప్పాడని సదరు మహిళ ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement