ఆ భూవిలయానికి ఏడాది..
ఏప్రిల్ 25 ఈ తేది గుర్తుకు వస్తేనే నేపాల్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. మళ్లీ అలాంటి భూకంపం సంభవించే అవకాశం ఉందనే పరిశోధకుల మాటలు వారి మనసులను కకావికలం చేస్తున్నాయి.
గత ఏడాది ఇదే రోజున నేపాల్లో సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది మరణించగా, 22వేల మంది గాయపడ్డారు. 8 లక్షలకు పైగా నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి తాజాగా నేపాల్లో సంభవించిన 4.0 కన్నా ఎక్కువగా నమోదువుతూ సంభవించిన భూకంపాల సంఖ్య 451. మొత్తంమీద సంవత్సరకాలంలో నేపాల్ భూమి దాదాపు 30వేల సార్లు కంపించింది.
ఈ సమస్య ఇక్కడితో అయిపోలేదని.. గత ఏడాది సంభవించిన భూకంపం మెయిన్ హిమాలయన్ థ్రస్ట్(ఎమ్హెచ్టీ) వద్ద ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణకు నిదర్శమని, ఆ భూకంపం వల్ల తగ్గిన రెసిడ్యువల్ ఎనర్జీ కేవలం ఫ్రాక్షన్స్లోనే ఉంటుందని త్వరలోనే ఇలాంటి భూకంపాలు నేపాల్ను తాకనున్నాయని వారు పేర్కొంటున్నారు.
నేచర్ జియోసైన్స్ గత ఆగష్టులో ప్రచురించిన జర్నల్లో 8.0 కన్నా తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలున్నట్లు తెలిపింది. గతంలో భూకంప బాధితులు తూర్పు నేపాల్లో ఎక్కువగా ఉండగా, ఈసారి మాత్రం 1505 సంవత్సరం నుంచి ఒక్క భూకంప కేంద్రం కూడా నమోదు కాని దక్షిణ నేపాల్లో భూకంపం సంభవింస్తుందని ప్రచురించింది.