
మరోసారి మోసం చేశారు
చంద్రబాబు ప్రధాని చేత హోదాపై ప్రకటన చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరమని వైఎస్సాఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు.
మంగళగిరి: చంద్రబాబు ప్రధాని చేత హోదాపై ప్రకటన చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరమని వైఎస్సాఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు.
ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రులను అవమానపరిచారని...మోదీ ప్రసంగంలో ప్రత్యేక హోదాపై ప్రస్తావన చేయకపోవడం విచారకరమని ఆర్కే తెలిపారు. ఏపీకి ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టి, నీళ్లుతో సరిపెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల భూముల తీసుకుని నిర్మించేది ప్రజా రాజధాని కాదు.. ధనికుల రాజధాని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.