హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి
– బంద్‌ను విజయవంతం చేయండి
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పేర్కొన్నారు. విభజన హామీల్లో అత్యంత కీలకమైనది హోదానేనని, దానిని విస్మరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదన్నారు. స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ఏపీ ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తమపార్టీ అధినేత శనివారం బంద్‌కు పిలపునిచ్చారని, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలన్నారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. హోదాపై ప్రజలను చైతన్య పరిచే రీతిలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలన్నారు. నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి బంద్‌లో పాల్గొనాలన్నారు. బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి సూచించారు. ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి రెహ్మాన్..కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ట్రేడ్ యూనియన్, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షులు టి.వి.రమణ, ఫిరోజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, కార్యదర్శి సలోమి, నగర ప్రధాన కార్యదర్శి నూరుల్లా ఖాద్రి, కార్యదర్శి మునాఫ్, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్వర్‌బాషా నగర అధ్యక్షుడు కటారి సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.