వైఎస్‌ఆర్‌సీపీ బైక్ ర్యాలీ
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా కోసం శనివారం నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఊపి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ నంద్యాల చెక్‌పోస్టు, రాజ్‌విహార్, పాతబస్తీ, ఆర్టీసీ బస్టాండుల మీదుగా జాతీయ రహదారి వరకు కొనసాగింది. పార్టీ జిల్లా నాయకులు నాగరాజు యాదవ్, అనిల్‌కుమార్, రఘు, డి.కె.రాజశేఖర్, పర్ల శ్రీధర్‌రెడ్డి, అల్లీపీరా, కల్లూరు అర్బన్ ఇన్‌చార్జి బి. మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.