
ఆధార్ కార్డులు తొలగింపు.. చెక్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 81 లక్షల ఆధార్‌కార్డులను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) డీ-యాక్టివేట్ చేసింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ రెగ్యులేషన్, 2016లోని సెక్షన్ 27, 28ల ప్రకారం ఆధార్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్(ఏఎల్‌సీఎమ్)లో నిబంధనల ఆధారంగా ఆధార్ నంబర్లను తొలగించారు.
మీ ఆధార్ యాక్టివేట్‌గా ఉందా?
మీ ఆధార్ నంబర్ యాక్టివేట్‌గా ఉందా? లేదా? అనే విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సివుంటుంది.
1. కింద కనిపిస్తున్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆధార్ వెబ్‌సైట్లోకి వెళ్లొచ్చు.
ఆధార్ వెబ్‌సైట్‌కు ఇక్కడ క్లిక్ చేయండి
2. పేజ్ ఓపెన్ అయిన తర్వాత 12 అంకెల మీ ఆధార్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్‌ను కూడా దాని బాక్సులో నింపి వెరిఫై అనే బటన్‌ను నొక్కాలి. మీ ఆధార్ నంబర్ కనుక యాక్టివేషన్‌లో ఉంటే స్క్రీన్‌పై ఓ కన్ఫిర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. మీ వయసు, మీ రాష్ట్రం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు చెందిన చివరి మూడు అంకెలు అందులో ఉంటాయి.
3. ఒక వేళ మీ ఆధార్ నంబర్ డీ-యాక్టివేట్ అయితే స్క్రీన్ మీద ఎలాంటి వివరాలు కనిపించవు.