ఇదేమి గోలప్పా !
Published Sat, Oct 15 2016 11:55 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
లక్కింశెట్టి శ్రీనివాసరావు :
తెలుగుదేశం పార్టీ మూడు దశాబ్దాల రాజకీయ యవనికలో జిల్లాలో క్రియాశీలక నాయకుడాయన. జిల్లా రాజకీయాల్లో ఫుల్‌టైమ్ నాయకుడనే చెçప్పుకోవచ్చు. టీడీపీ ఆవిర్బావం నుంచి పార్టీ జెండాను భుజాన మోస్తున్నారు. సమకాలికులంతా ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు అయిపోతుంటే సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని మథనపడని రోజంటూ లేదు. ఏదో పుట్టి పెరిగిన ఊర్లో వచ్చిన స్థానిక అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజాప్రతినిధిగా ఎన్నికై సంతృప్తి పడేవారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరిక మూడు దశాబ్దాలు తరువాత తీరింది. ఆ కల సాకారమై ముఖ్యమంత్రితో సమానమైనంత కాకపోయినా ఆ తరువాత స్థానం దక్కినప్పుడు ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఎమ్మెల్యే కావడమే గొప్ప అనుకుంటే అంతకంటే పెద్ద హోదాయే దక్కిందని
ఆయన కంటే మూడు దశాబ్థాలుగా వెంట తిరిగిన వారంతా తెగ సంబరపడ్డారు. ఆ హోదా చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. అంతటి హోదా తమ నాయకుడుకు వచ్చిందనే సంతోషం కన్నా, సార్ చెప్పినా పనులు కావడం లేదనే ఆవేదన వారి అనుచరులను కుంగదీస్తోంది. కోపమొస్తే నోరిచ్చుకుని పడిపోతారనేదే తప్ప సహజంగానే భోళా శంకరుడు. లేదంటే ఇన్నేళ్ల రాజకీయాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదంటే ఆయన అమాయకత్వం అర్ధం చేసుకోవచ్చునని ఆయన సన్నిహితుల ఉవాచ. అలా అని అంత నిజాయతీ పరుడంటే అదీ కాదండోయ్. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌తో చేపట్టిన రోడ్డును ఆనుకుని భారీగానే కూడబెట్టారని సొంత పార్టీలోనే గుసగుసలున్నాయి. పుట్టి పెరిగిన సీమలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు తవ్వకాల్లో కొద్దోగొప్పో సాయం అందించడం, అందినదిSపుచ్చుకోవడం మినహా మరే పెద్దపెద్ద దోపిడీలకు పోలేదని ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన ఒక వీడియో పుటేజీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అధినేత కంటే పార్టీలో పెరిగిన చిన్న నేత పెత్తనం ముందు అనుభవం మోకరిల్లిందని మదనపడుతున్న అభిమానులూ లేకపోలేదు. మంత్రివర్గ విస్తరణలో అతని బెర్తుకు ఢోకా లేవని కొందరంటుంటే ... జరిపడక తప్పదని మరికొందరంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ‘పార్టీ అప్పగించే బాధ్యతలు ఎటువంటివైనా చేపడతానని’ ఇటీవల మీడియా మిత్రులు ముందు ప్రకటించి తన విధేయతను ఆ అప్ప చెప్పకనే చెప్పుకున్నారు.
Advertisement
Advertisement