Bihar Man Alleges Stabbing For Putting Nupur Sharma Video In WhatsApp Status - Sakshi
Sakshi News home page

Nupur Sharma Video: వాట్సాప్‌ స్టేటస్‌గా నూపుర్‌ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?!

Published Tue, Jul 19 2022 1:55 PM | Last Updated on Tue, Jul 19 2022 3:28 PM

Nupur Sharma Video: Bihar Man Alleges Stabbing For Supporting Her - Sakshi

పాట్నా: నూపుర్‌ శర్మకు సంబంధించిన వివాదాస్పద వీడియోను చూశాడని, ఆమెకు మద్దతుగా ఆ వీడియోను తన వాట్సాప్‌లో స్టేటస్‌లో పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై కత్తులతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు కొందరు!. 

బీహార్‌ సీతామర్హిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత పోలీసులు ఈ ఘటనను గ్రూప్‌ తగాదాగా భావించారు. లోకల్‌ పొగాకు మత్తులో దాడి జరిగిందని ప్రకటించారు. అయితే.. బాధితుడు మాత్రం ఉద్దేశపూర్వకంగా తనపై దాడి జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు. 

ప్రస్తుతం బాధితుడు అంకిత్‌ ఝా.. దర్భంగా నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నాడు. నూపుర్‌ శర్మ వీడియోను తన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకున్న తర్వాతే దాడి జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. నన్‌పూర్‌ పీఎస్‌ పరిధిలో జులై 15వ తేదీ సాయంత్రం ఘటన జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజే నలుగురు దుండగుల్లో ఇద్దరిని గుర్తించి అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

తొలుత పాన్‌ షాప్‌ దగ్గర సిగరెట్‌ తాగే విషయంలో గొడవ జరిగిందని భావించాం. అయితే.. నూపుర్‌ శర్మవీడియో వల్లే దాడి జరిగిందని బాధితుడు చెప్తున్నాడు. అందుకే దర్యాప్తు చేపట్టాం అని సీతామర్హి ఎస్పీ హర్‌ కిషోర్‌రాయ్‌ తెలిపారు. దాడికి సంబంధించినదిగా చెబుతూ.. ఓ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement