సాక్షి, న్యూఢిల్లీ: 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వీరిలో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులున్నారు. ఈ నెల 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 47 మంది మాజీ న్యాయమూర్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల నుంచి ఏడుగురు ఉన్నారు.
సీనియర్ హోదా పొందిన వారిలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ అడ్డుల వెంకటేశ్వర రెడ్డి సీనియర్ హో దా పొందారు. అలాగే, ఏపీ హైకోర్టు మాజీ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వ రయ్య, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, మాజీ న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment