ప్రభుత్వ రంగ సంస్థ 'రైల్ వికాస్ నిగమ్'కు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా రైల్ వికాస్ నిగమ్ ఇప్పుడు 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నవరత్న హోదా పొందింది. ఇప్పటివరకు మినీ రత్న హోదాలో ఉన్న రైల్ వికాస్ నిగమ్ నవరత్న హోదా కైవసం చేసుకుంది.
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది రైల్వే శాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. దీని టర్నోవర్ సంవత్సరానికి రూ. 19,381 కోట్లు. అంతే కాకుండా గత 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం రూ. 1,087 కోట్లు. కావున ఈ సంస్థకు నవరత్న హోదా కల్పించాలనే యోచన గతం నుంచి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికి సాధ్యమైంది.
నవరత్న హోదా పొందటం వల్ల సంస్థ చాలా విషయాల్లో సొంత నిర్ణయాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం, ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో స్వతంత్య్రం ఉంటుంది. ఇది సంస్థ వేగవంతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
(ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!)
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కి నవరత్న హోదా కల్పించే ప్రాతి పదికను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని, ఈ ఆమోదం ప్రకారం ఇకపైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నవరత్న హోదా పొందిన సంస్థగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొనసాగుతుందని డిపిఈ (Department of Public Enterprises) ట్విటర్ ద్వారా తెలిపింది.
(ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!)
Hon'ble Finance Minister has approved the upgradation of RVNL to Navratna CPSE. RVNL will be the 13th Navratna amongst the CPSEs. RVNL is a Ministry of Railways CPSE with an annual turnover of Rs 19381 crores and net profit of Rs 1087 crores for the years 2021-22. @RailVikas
— Department of Public Enterprises (@DPE_GoI) April 26, 2023
ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి..
Comments
Please login to add a commentAdd a comment