DPE
-
నవరత్న హోదా పొందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ - పూర్తి వివరాలు
ప్రభుత్వ రంగ సంస్థ 'రైల్ వికాస్ నిగమ్'కు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా రైల్ వికాస్ నిగమ్ ఇప్పుడు 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నవరత్న హోదా పొందింది. ఇప్పటివరకు మినీ రత్న హోదాలో ఉన్న రైల్ వికాస్ నిగమ్ నవరత్న హోదా కైవసం చేసుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది రైల్వే శాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. దీని టర్నోవర్ సంవత్సరానికి రూ. 19,381 కోట్లు. అంతే కాకుండా గత 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం రూ. 1,087 కోట్లు. కావున ఈ సంస్థకు నవరత్న హోదా కల్పించాలనే యోచన గతం నుంచి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికి సాధ్యమైంది. నవరత్న హోదా పొందటం వల్ల సంస్థ చాలా విషయాల్లో సొంత నిర్ణయాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం, ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో స్వతంత్య్రం ఉంటుంది. ఇది సంస్థ వేగవంతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కి నవరత్న హోదా కల్పించే ప్రాతి పదికను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని, ఈ ఆమోదం ప్రకారం ఇకపైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నవరత్న హోదా పొందిన సంస్థగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొనసాగుతుందని డిపిఈ (Department of Public Enterprises) ట్విటర్ ద్వారా తెలిపింది. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) Hon'ble Finance Minister has approved the upgradation of RVNL to Navratna CPSE. RVNL will be the 13th Navratna amongst the CPSEs. RVNL is a Ministry of Railways CPSE with an annual turnover of Rs 19381 crores and net profit of Rs 1087 crores for the years 2021-22. @RailVikas — Department of Public Enterprises (@DPE_GoI) April 26, 2023 ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.. -
ఆర్థిక శాఖ పరిధిలోకి డీపీఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. డీపీఈ ఆర్థిక శాఖ కిందకు రావడం వల్ల మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్ ఉద్యమ్ విభాగ్)’ను చేర్చినట్టు కేబినెట్ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందుగా ఈ నిర్ణయం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా.. దాన్ని సైతం ఆర్థిక శాఖలో విలీనం చేసిన విషయం విదితమే. దీనికితోడు విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని కూడా ఆర్థిక శాఖ కిందకు తీసుకొచ్చారు. భారీ పరిశ్రమల శాఖ కింద 44 సంస్థలు భారీ పరిశ్రమల శాఖ ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించి కొనసాగనుంది. బీహెచ్ఈఎల్, సిమెంట్ కార్పొరేషన్, స్కూటర్స్ ఇండియా, హెచ్ఎంటీ, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తదితర 44 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు భారీ పరిశ్రమల శాఖ కింద కొనసాగుతాయి. ఈ శాఖ కింద ఉన్న కంపెనీల్లో చాలా వరకు మూతపడి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఉన్నవి కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వరం 2021–22 బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ మెగా ఐపీవోతోపాటు ఐడీబీఐలో వాటాల ఉపసంహరణ, బీపీసీఎల్, బీఈఎంల్, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. -
ఆ ‘డబ్బు’ను ప్రభుత్వం వద్దే ఉంచండి
సీపీఎస్ఈ ఉద్యోగులకు డీవోపీటీ ఆదేశం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (సీపీఎస్ఈ) పనిచేసే ఉద్యోగులందరూ..సీపీఎస్ఈల అనుబంధ, సంయుక్త సంస్థలలో విధులు నిర్వహిస్తున్నపుడు వారి సేవలకు సదరు సంస్థల నుంచి పొందే సిట్టింగ్ ఫీజులు, బోనస్‌లు, లాభాలు–షేర్లలో వాటాలు వంటి ధన సంబంధమైన అదనపు ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వం దగ్గరే డిపాజిట్ చేయాలి. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేస్తూ అన్ని మంత్రిత్వ శాఖలను వారి ఉద్యోగుల్లో దీనిపై అవగాహన కల్పించాలని కోరింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, పంక్షనల్ డైరెక్టర్లు సహా ఎవరైనా ఇప్పటికే ఇలాంటి అదనపు ప్రయోజనాలు పొంది ఉంటే, వాటిని తమ మాతృసంస్థ దగ్గరే డిపాజిట్ చేయాలని చెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఏ ఉద్యోగి సేవలనైనా, ఏ విధంగా అయినా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందనీ, అందుకోసం ఉద్యోగులు అదనపు పారితోషికం అడగకూడదని ప్రభుత్వ సంస్థల విభాగం (డీపీఈ) నిబంధనల్లో పేర్కొంది.