పార్టీలకతీతంగా పోరాడాలి
Published Sun, Aug 7 2016 11:00 PM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
నెల్లూరు(టౌన్) : ప్రత్యేకహోదాపై జెండాలు, అజెండాలు పక్కన బెట్టి పార్టీలకతీతంగా పోరాడాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య అన్నారు. నగరంలోని సర్వోదయ కళాశాలలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హోదా రాకుంటే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలతో పోల్చి, అవి ఒప్పుకోవడం లేదని సాకులు చెప్పడం తగదన్నారు. ప్రధానంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హోదా కోసం ముందుకురావాలని కోరారు. సమావేశంలో లాయర్స్ అసోసియేషన్ నాయకులు చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ నాయకులు నాగేంద్రకుమార్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కొప్పులు చంద్రశేఖర్, బీటీఏ జిల్లా అధ్యక్షడు శేఖర్, మనోహర్, మనోజ్‌బాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement