వాట్సప్ వినియోగదారుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. ఈ కొత్తగా తెచ్చిన ఫీచర్లు అనేవి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం అలాంటి వాటిలో ఒక దాని గురుంచి తెలుసుకుందాం. మనం రోజు నిత్యం మనకు నచ్చిన ఫోటోలు, వీడియోలు, ఇతర వాటిని మన వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేస్తూ ఉంటాం. తర్వాత మన స్టేటస్ ని ఎంత మంది చూసారో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. మనకు కళ్లకు కనిపించేదంతా నిజం కాదు.. మీరు స్టేటస్ చుసిన వాళ్లు కాకుండా ఇతరులు కూడా మీ స్టేటస్ ని చూస్తూ ఉంటారు.
అలాగే మీరు కూడా ఈ చిన్న ట్రిక్ ద్వారా ఇతరుల వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడవచ్చు. అయితే మీరు ముందుగా మీ వాట్సప్ ని ఓపెన్ చేసాక మీ వాట్సాప్ సెట్టింగులకు వెళ్ళండి. అక్కడ మీకు అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి. అందులో మీకు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది.. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రీడ్ రిసిప్ట్ ఆన్ చేసి ఉంటె ఆఫ్ చేయండి.
ఆ ఆప్షన్‌ను ఆఫ్ చేస్తే మీరు స్టేటస్ చూసినట్లు అవతలి వ్యక్తికి తెలియదు. అయితే ఇక్కడ మీకు చిన్న సమస్య కూడా ఉంది. రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేయడం ద్వారా మీ స్టేటస్‌లు ఎవరెవరు చూశారనేది కూడా మీకు తెలియదు. ఇలా చేయడం ద్వారా.. అవతలి వ్యక్తి స్టేటస్ చూసినవారి లిస్ట్‌లో మీ పేరు రాకుండా చేయొచ్చు. దీని ద్వారా మీరు మీ మిత్రులు పంపిన పోస్టులు చదివిన కూడా వారికీ కనిపించదు. (చదవండి: 'ఫౌజీ' ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment