ఓటు హక్కు విలువను చాటి చెప్పండి
Published Mon, Jan 23 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు విలువను చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించికుకొని ఈ నెల 25న భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ప్రతి ఏడాది జనవరి 25న పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ నుంచి పోలీసు పేరెడ్ గ్రౌండు వరకు నిర్వహించే మెగా ర్యాలీలో అన్ని విధ్యాసంస్థలతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొనాలని వివరించారు.
Advertisement
Advertisement